-
-
Home » Andhra Pradesh » East Godavari » bunny allu arjun
-
నర్సరీలో సందడి చేసిన బన్నీ
ABN , First Publish Date - 2020-12-15T06:51:28+05:30 IST
సినీ హీరో అల్లు అర్జున్ సోమవారం కడియం మండలం కడియపులంక గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీలో సందడి చేశారు
కడియం, డిసెంబరు 14: సినీ హీరో అల్లు అర్జున్ సోమవారం కడియం మండలం కడియపులంక గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీలో సందడి చేశారు. మొక్కల మధ్య సుమారు గంట సేపు గడిపారు. పలు రకాల స్వదేశీ, విదేశీ మొక్కల ప్రత్యేకతలను నర్సరీ రైతులు గంగుమళ్ళ సత్యనారాయణ, తాతాజీ, నగేష్‌ను అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన మొక్కలు బన్నీని విశేషంగా ఆకట్టుకున్నాయి. నర్సరీలు అద్భుతంగా ఉన్నాయని, రెండు రోజుల పాటు ఉండాలని ఉందని బన్ని అన్నారు. ఆయనతో పాటు సోదరుడు శిరీష్ ఉన్నారు. బన్నీ వచ్చారని తెలియడంతో అభిమానులు గంగుమళ్ళ నర్సరీకి వచ్చారు.