-
-
Home » Andhra Pradesh » East Godavari » Bulk drug park in the district
-
జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్
ABN , First Publish Date - 2020-08-20T11:42:25+05:30 IST
జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో బుధవారం సచివాలయంలో భేటీ అయిన

ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ 2006 చట్ట సవరణకు
రాష్ట్ర కేబినెట్ ఆమోదం
కాకినాడ(ఆంధ్రజ్యోతి)ఆగస్టు 19 : జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో బుధవారం సచివాలయంలో భేటీ అయిన మంత్రి మండలి ఈ మేరకు తీర్మానం చేసింది. వచ్చే ఎనిమిదేళ్లలో సదరు పార్క్ ఏర్పాటు ద్వారా సుమారు రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేబినెట్ అంచనాకు వచ్చింది. తద్వారా పార్క్‌లో ఏర్పాటు చేసే ఔషధ కంపెనీల ద్వారా రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని భావి స్తోంది. ఏపీఐఐసీకి అనుబంధంగా డ్రగ్ కార్పొరేషన్ జిల్లాలో ఏర్పాటు కానుంది.
అయితే జిల్లాలో ఉన్న పారిశ్రామిక వాడల్లో ఎక్కడ ఈ పార్క్ ఏర్పాటుకు అనుకూలమో త్వరలో నిర్ణయించనుంది. విశ్వస నీయ వర్గాల సమాచారం మేరకు పెద్దాపురం పారిశ్రామికవాడలో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే ఈ భేటీలో రాష్ట్ర పరిధిలో ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం 2006 ను సవరించి కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ఈ చట్టంలో పలు మార్పులు జరగనున్నాయి.
దీంతో ఆక్వాకల్చర్‌లో నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లా తర్వాత ఇక్కడే అధికంగా ఈ కల్చర్ సాగులో ఉండడంతో దీనిపై ఆధారపడిన రైతు లకు త్వరలో నాణ్యమైన విత్తనం లభిస్తుంది. రొయ్య పిల్లల ఉత్పత్తిలో యాంటీబయోటిక్స్ వాడకుండా ప్రొ బయాటిక్స్ ద్వారా నాణ్యమైన విత్తనాన్ని అభివృద్ధి చేయాలనేది తాజాగా సవరించిన చట్టంలో పొందుపరచడంతో మన హేచరీల్లో త్వరలో అమల్లోకి రానుంది.