రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-11-27T06:02:14+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ బాలుడు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

కాకినాడ క్రైం, నవంబరు 26: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ బాలుడు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కాకినాడ పర్లోవపేటకు చెందిన చింతల రాజా (17) గురువారం బైక్‌పై వెళుతూ స్థానిక పిడుగులమ్మతల్లి ఆలయం వద్ద కారును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స కోసం 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more