బాలికపై బాలుడి అత్యాచారం

ABN , First Publish Date - 2020-12-25T06:17:34+05:30 IST

తోకాడలో బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబం ఏడు సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం తోకాడ గ్రామానికి వచ్చింది.

బాలికపై బాలుడి అత్యాచారం

రాజానగరం, డిసెంబరు 24: తోకాడలో బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబం ఏడు సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం తోకాడ గ్రామానికి వచ్చింది. అతనికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఇదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తరచూ వారి ఇంటికి వస్తూ బాలికతో ఆటలు ఆడుకుంటూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన బాలుడు బాలికతో ఆటలు ఆడుతూ ఇంటి వెనుకకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. రక్తస్రావం కావడం గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో విషయం బయటపడింది. డీఎస్పీ రవికుమార్‌ బాధితుల నుంచి వివరాలు సేకరించారని, జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ సుభాష్‌ తెలిపారు.  బాధిత బాలిక రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.  


 

Updated Date - 2020-12-25T06:17:34+05:30 IST