ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు
ABN , First Publish Date - 2020-12-29T06:26:20+05:30 IST
వేమగిరి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాలు ప్రకారం... ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతానికి చెందిన చీకట్ల రాకేష్, అతని స్నేహితుడు అల్లాడి రాజేష్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వేమగిరిలో క్రికెట్ ఆడడానికి వెళ్లారు.
కడియం, డిసెంబరు 28: వేమగిరి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతానికి చెందిన చీకట్ల రాకేష్, అతని స్నేహితుడు అల్లాడి రాజేష్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వేమగిరిలో క్రికెట్ ఆడడానికి వెళ్లారు. ఇంతలో వారిద్దరూ స్నాక్స్ కొనుక్కోవడానికి రాజేష్ సోదరుడు దుర్గాప్రసాద్ మోటారు సైకిలుపై సమీపంలో ఉన్న షాపునకు వెళ్లారు. తిరిగి వస్తూ పాయిజన్ దాబా వద్ద రోడ్డు దాటుతున్నారు. ఇంతలో వేమగిరి నుంచి బొమ్మూరు వైపు వెళ్తున్న ఆటో మోటారు సైకిలును ఢీకొంది. వెనుక కూర్చున్న రాకేష్ (11) తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న రాజేష్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.