పంటు కష్టాలు పట్టవా?

ABN , First Publish Date - 2020-12-19T07:19:58+05:30 IST

చెబుతున్నప్పటికీ ఇతర కారణాలు వేరే ఉన్నట్టు ప్రజలు బహిరంగంగా ఆరోపణలు సంధిస్తున్నారు.

పంటు కష్టాలు పట్టవా?

సఖినేటిపల్లి-నర్సాపురం మధ్య నిలిచిన పంటు రాకపోకలు

గత తొమ్మిది నెలలుగా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

వాటాలు, కమీషన్లు తెగకే ప్రయాణికులకు కష్టాలంటున్న ప్రతిపక్షాలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

చెబుతున్నప్పటికీ ఇతర కారణాలు వేరే ఉన్నట్టు ప్రజలు బహిరంగంగా ఆరోపణలు సంధిస్తున్నారు. కొవిడ్‌ అనంతర పరిస్థితులతో జిల్లాలో ఉన్న అన్ని ముఖ్య రేవులతోపాటు కోనసీమలో ఉన్న ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య పంట్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాకపోకలు యఽథావిధిగా సాగుతున్నాయి. కానీ మాధవాయిపాలెం ఫెర్రీలో మాత్రం పంటు నిర్వహణకు సాంకేతిక కారణాలు చూపి నిలిపివేశారు. రేవు ఆదాయంలో కొందరు వాటాలు, మరికొందరు కమీషన్లు కోరుతున్న కారణంగానే గోదావరి జిల్లాల ప్రజలకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అటు నర్సాపురం ఇటు సఖినేటిపల్లివైపు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు రేవులో రాకపోకలు పునరుద్ధరించాలంటూ ఆందోళనలు చేపట్టినప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వదల్లేదు. పంట్లు అనుమతించా లంటూ చేసిన దరఖాస్తు కాకినాడ పోర్టు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉంది. గతంలో ఇచ్చిన అనుమతికి మళ్లీ కొర్రీలువేసి తిరిగి ఇరిగేషన్‌ అధికారుల ద్వారా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు దర ఖాస్తు చేశారు. అనుమతి కోసం ప్రజలు, వివిధ ప్రతిపక్ష పార్టీలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పంట్ల రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. అయితే గతంలో ధవళేశ్వరం నుంచి ఇరిగేషన్‌శాఖ అధికారులు ఒక పంటును రప్పించి రాకపోకలు సాగించాలని నిర్ణయించినా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేని కారణంగా అది అక్కడే ఉంది. ఇరిగేషన్‌శాఖ అధి కారుల ద్వారా కాకినాడ పోర్టు అధికారులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. ఇప్పటికైనా పంటు రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సి ఉంది.Read more