ఆ బోటు..జాడెటు?

ABN , First Publish Date - 2020-12-10T06:03:15+05:30 IST

ఒడిసా నుంచి నలుగురు మత్య్సకారులతో యల్లయ్యపేట బయలుదేరిన బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ బోటు..జాడెటు?

సముద్రంలో నిలిచిన మత్స్యకారుల బోటు

కుటుంబ సభ్యుల ఆందోళన 

తొండంగి, డిసెంబరు 9: ఒడిసా నుంచి నలుగురు మత్య్సకారులతో యల్లయ్యపేట బయలుదేరిన బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల ఆచూకీ గుర్తించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.  ఈ మేరకు ఎఫ్‌డీవో ఉమామహేశ్వరావుకు విజ్ఞప్తి చేశారు.  ఈనెల 7న ఒడిసాలోని పారాదీప్‌ నుంచి బయలుదేరిన బోటు గంజాం జిల్లా అడ్డుకొండ తీరంలో నిలిచిపోయిందని, ఈ విషయం బోటులో ఉన్న ఈశ్వరరావు పంపిన వాయిస్‌ మెసేజ్‌ ద్వారా తెలిసింది. ఈశ్వరరావుతో బోటులో ఉన్న వెంకటేశ్వర్లు, రమేష్‌, శ్రీనివా్‌సరావు సురక్షితంగా ఉన్నట్టు తెలిసిందని, అనంతరం ఫోన్‌ సిగ్నల్‌ అందకపోవడంతో వారి ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్‌డీవో తెలిపారు. సంబంధిత సమాచారన్ని కోస్ట్‌గార్డుకు తెలిపినట్టు ఆయన చెప్పారు.  

Updated Date - 2020-12-10T06:03:15+05:30 IST