రక్తదానంతో ప్రాణదానం
ABN , First Publish Date - 2020-10-03T06:34:22+05:30 IST
రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ యువ నేత ఆదిరెడ్డి వాసు అన్నారు. ప్రభుత్వాసుపత్రి
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 2: రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ యువ నేత ఆదిరెడ్డి వాసు అన్నారు. ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో గుడ్‌కేర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేస్తే అవసరమైనవారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్‌కుమార్, బూసరి చిన్ని, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ కీర్తన, కావూరి సురేష్ పాల్గొన్నారు.