315 కిలోల నల్లబెల్లం స్వాధీనం
ABN , First Publish Date - 2020-10-19T06:12:25+05:30 IST
315 కిలోల నల్లబెల్లం స్వాధీనం

ప్రత్తిపాడు, అక్టోబరు 18: ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 315 కిలోల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు. మండలంలో ఒమ్మంగి నుంచి పెద్దిపాలెం వెళ్లే మార్గంలో 7 బస్తాల్లో 315 కిలోల నల్లబెల్లాన్ని రవాణా చేస్తున్న ఆటోను సీజ్‌చేసి పింకి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. మండలంలోని పోతులూరు గ్రామంలో 20 లీటర్ల సారాను తరలిస్తున్న వ్యక్తిని అడ్డుకోగా నిందితుడు బైక్ వదిలి పరారయ్యాడు. కిర్లంపూడి మండలం పాలెంలో 10 లీటర్ల సారాతో నలగొండ అప్పారావును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.