బీజేపీ బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2020-10-21T05:51:59+05:30 IST

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 20: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పార్టీని

బీజేపీ బలోపేతానికి కృషి
మాలతీరాణికి స్వాగతం పలుకుతున్న దృశ్యం

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాలతీరాణి

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 20: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాలతీరాణి కోరారు. రాయుడుపాలెం పార్టీ కార్యాలయానికి మంగళవారం విచ్చేసిన ఆమెకు మండ లాధ్యక్షుడు కాళ్ల ధనరాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నాయకులు సీహెచ్‌ రామ్‌కుమార్‌, సూర్యకుమారి, అనపర్తి వెంకటేష్‌, బాలరాజు, పెండెం బాబ్జి, యర్రమిల్లి గౌరి, విజయరామయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T05:51:59+05:30 IST