ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి

ABN , First Publish Date - 2020-11-06T06:12:29+05:30 IST

ప్రత్తిపాడు, నవంబరు 5: ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరుగుతుందని, ఈ పథకం వైసీపీ కార్యకర్తలకే ఉపాధిగా మారిందని బీజేపీ రాష్ట్ర మీడియా

ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి
సమావేశంలో మాట్లాడుతున్న రవికిరణ్‌

బీజేపీ రాష్ట్ర ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్‌

ప్రత్తిపాడు, నవంబరు 5: ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరుగుతుందని, ఈ పథకం వైసీపీ కార్యకర్తలకే ఉపాధిగా మారిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఇనచార్జి పెద్దిరెడ్డి రవికిరణ్‌ విమర్శించారు. ప్రత్తిపాడు బీజేపీ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని రవికిరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఉపాధి పనుల్లో వైసీపీ కార్యకర్తలు మస్తర్లు వేసుకుని పథకాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ముంపు ప్రాంతాల్లో కోట్లు ఖర్చుపెట్టి ఇళ్ల స్థలలాకు భూములు కొనుగోలు చేశారని, దీనిలో కూడా పెద్దఎత్తున అక్రమాలు ఉన్నాయన్నారు. వీటిపై బీజేపీ పోరాడనుందని చెప్పారు. ఇందుకోసం త్వరలోనే తమ పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన చేపటనున్నారని తెలి పారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసమే కార్యకర్తలకు ఈ తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా నాయకులు సింగిల్లిదేవి సత్తిరాజు, కుండల సాయికుమార్‌, గొల్ల శ్రీనివాస్‌, హరేరామ్‌, బాలుదొర, రాజబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T06:12:29+05:30 IST