బీజేపీ బలోపేతానికి కృషి
ABN , First Publish Date - 2020-10-28T05:08:06+05:30 IST
సామర్లకోట, అక్టోబరు 27: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ప్రశిక్షణ ప్రముఖ్ పెద్దిరెడ్డి రవికిరణ్ పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ

సామర్లకోట, అక్టోబరు 27: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ప్రశిక్షణ ప్రముఖ్ పెద్దిరెడ్డి రవికిరణ్ పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ ప్రశిక్షణ సన్నాహక సమావేశం మంగళవారం బీజేపీ ఇన్‌చార్జి తుమ్మల పద్మజాప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రవికిరణ్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ప్రశిక్షణ నిర్మాణం, దిశ నిర్దేశంపైనా కార్యకర్తలకు వివరించారు. సమావేశంలో పద్మజ, చెరుకూరి రవికృష్ణ, జి.కళ్యాణ్‌కుమార్, రమణ, మోటూరి వీరబాబు, కర్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.