సంక్షేమ పథకాలను చేరువ చేయాలి

ABN , First Publish Date - 2020-11-19T05:42:31+05:30 IST

ఏలేశ్వరం, నవంబరు 18: కుల,మతాలకు అతీతంగా ప్రధాని మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువచేసి చైతన్యం కల్పించాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఏలేశ్వరం మండలం

సంక్షేమ పథకాలను చేరువ చేయాలి
సిరిపురం సమావేశంలో మాట్లాడుతున్న రామ్‌కుమార్‌

బీజేపీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్‌

ఏలేశ్వరం, నవంబరు 18: కుల,మతాలకు అతీతంగా ప్రధాని మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువచేసి చైతన్యం కల్పించాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఏలేశ్వరం మండలం సిరిపురంలోని పలు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ 2024 నాటికి రాష్ట్రంలో మరింత బలమైన శక్తిగా బీజేపీ రూపుదిద్దుకునేలా క్షేత్రస్థాయిలో మరింతగా విస్తరింపజేసే బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు. ఈనెల 20,21న ప్రత్తిపాడు లయన్స్‌క్లబ్‌ హాల్‌లో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులను అందరూ హాజరై విజయవంతం చేయాలని రామ్‌కుమార్‌ కోరారు. కార్యక్రమంలో కొల్లా శ్రీనివాస్‌, వెలుగూరి హరేరామ్‌, సాగి బంగార్రాజు, పోకల చిన్నా, వీఎ్‌సఎన్‌.రాజు, వి.శ్రీనుబాబు, పెట్ల కొండబాబు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T05:42:31+05:30 IST