-
-
Home » Andhra Pradesh » East Godavari » bjp leader konadayya waring
-
పోలవరంపై వైఎస్ విగ్రహం పెడితే పగలకొడతాం
ABN , First Publish Date - 2020-11-25T05:30:00+05:30 IST
తుని, నవంబరు 25: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని పగలకొడతామని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మాలకొండయ్య అన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం కేంద్ర ప్రభుత్వ

బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మాలకొండయ్య
తుని, నవంబరు 25: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని పగలకొడతామని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మాలకొండయ్య అన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తుంటే వైఎస్ పేరును ఎలా పెడతారని ప్రశ్ని ంచారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పోలవరానికి కాపాలాదారు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వాన్ని నడిపించడం ముఖ్యమంత్రికి చేతకాలేదని ఆయన విమర్శిం చారు. మంత్రులు, నాయకులు ప్రజలను దోచుకోవడంలోనే ఉన్నారన్నారు. సస్పెండ్ చేసిన కాంట్రాక్టర్‌కు మళ్లీ పోలవరం కాంట్రాక్టు ఇవ్వడం కేవలం లంచం కోసమేనన్నారు. పేదల ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డారని, వీటిని గమనిస్తున్న ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కొండయ్య చెప్పారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు రామకృష్ణంరాజు, సాయికుమార్, సింగిల్‌దేవ్ సత్తిరాజు, వెలగా ఈశ్వరరావు, గడిడ్డ సూర్యనారాయణ, ఆకెళ్ల శాస్ర్తి పాల్గొన్నారు.