బైక్‌ దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2020-10-27T06:12:02+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక బైక్‌ల దొంగతనాలకు అలవాటు పడిన కొందరు యువకులు బిక్కవోలు పోలీసులకు చిక్కారు. బిక్కవోలు ఎస్‌ఐ పి.వాసు తెలిపిన వివరాల ప్రకారం..

బైక్‌ దొంగల అరెస్టు

బిక్కవోలు, అక్టోబరు 26: లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక బైక్‌ల దొంగతనాలకు అలవాటు పడిన కొందరు యువకులు బిక్కవోలు పోలీసులకు చిక్కారు. బిక్కవోలు ఎస్‌ఐ పి.వాసు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తొస్సిపూడి గ్రామంలో జరిగిన బైక్‌ దొంగతనం కేసుతో సంబంధం ఉన్న రాయవరం మండలం వెదురుపాక సావరానికి చెందిన కాకర దుర్గాప్రసాద్‌, సిరికి నాగరామకృష్ణ, గుత్తుల రాజేంద్ర, గుత్తుల విజయకుమార్‌, అల్లు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం మూడు బైక్‌లను దొంగతనం చేసినట్లు చెప్పారు.  వీరిలో ఇద్దరు కూలిపనులు చేసుకునేవారు. చంద్రశేఖర్‌ సివిల్‌ ఇంజనీర్‌. మిగిలిన వారు కాంట్రాక్టు ఉద్యోగులు. లాక్‌డౌన్‌తో పనులు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ నేరాలకు పాల్పడినట్లు నిందితులు తెలి పారు. వీరి నుంచి మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని, మం గళవారం అనపర్తి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ వాసు తెలి పారు.

Updated Date - 2020-10-27T06:12:02+05:30 IST