బైక్‌తో సహా ఇల్లు దోపిడీ

ABN , First Publish Date - 2020-12-28T05:56:36+05:30 IST

రాజమహేంద్రవరం పీఅండ్‌టీ కాలనీలో ఇంటి ముందు పార్కుచేసిన బైక్‌తో సహ ఇంట్లో పెట్టిన నగదు, బంగారు వస్తువులను గుర్తుతెలియని దొంగలు అపహరించుకుపోయారు.

బైక్‌తో సహా ఇల్లు దోపిడీ

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 27: రాజమహేంద్రవరం పీఅండ్‌టీ కాలనీలో ఇంటి ముందు పార్కుచేసిన బైక్‌తో సహ ఇంట్లో పెట్టిన నగదు, బంగారు వస్తువులను గుర్తుతెలియని దొంగలు అపహరించుకుపోయారు. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం పీఅండ్‌టీ కాలనీకి చెందిన పర్నాల రామకృష్ణ అనే వ్యక్తి ఈనెల 25న రాత్రి 10 గంటలకు తన ఇంటి ముందు బైక్‌ను పార్కుచేశాడు. ఉదయం లేచి చూస్తే ఇంట్లో పెట్టిన రూ.32వేలు నగదు, రెండు చిన్నపిల్లల బంగారు ఉంగ రాలు, ఇంటి బయట పార్కుచేసిన బైక్‌ కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని దొంగలు తన ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం జరిగినట్లు గ్రహించిన బాధితుడు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-28T05:56:36+05:30 IST