కాకినాడలో సైకిల్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2020-10-03T07:23:50+05:30 IST

కాకినాడలో త్వరలోనే సైక్లింగ్‌ క్లబ్‌లను ప్రోత్సహించేలా అత్యాధునిక ప్రమాణాలతో సైక్లింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయడం

కాకినాడలో సైకిల్‌ ర్యాలీ

అత్యాధునికంగా సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణం : వంగా గీత


కార్పొరేషన్‌ (కాకినాడ) అక్టోబరు,  2: కాకినాడలో త్వరలోనే సైక్లింగ్‌ క్లబ్‌లను ప్రోత్సహించేలా అత్యాధునిక ప్రమాణాలతో   సైక్లింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు  చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్‌ సభ్యురాలు వంగా గీత అన్నారు. మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌ నుంచి స్మార్ట్‌సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని మున్సిపల్‌ చైర్మన్‌ సుంకర పావని జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ర్యాలీకి హాజరైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ  నగరవాసుల్లో సైక్లింగ్‌పై ఆసక్తి బాగా పెరిగిందని, వారిని మరింత ప్రోత్సహించేలా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. సైక్లింగ్‌ వల్ల శారీరకoగానే కాకుండా ఆరోగ్యంగా కూడా దృఢంగా ఉంటామన్నారు. కలెక్టరు డి.మురళీధర్‌ రెడి ్డ మాట్లాడుతూ గాంధీ జన్మదినం పురస్కరించుకుని కాకినాడ కార్పొరేషన్‌ ఇటువంటి కార్యక్రమం చేయడం ఆనందకరమని, నగర ప్రజలకు క్రీడలపై ఆసక్తి ఎక్కువని, వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ, కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలు పాల్గొని సైకిల్‌ తొక్కారు. ఇతర జిల్లా, నగర ఉన్నతాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సైకిల్‌ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T07:23:50+05:30 IST