భవన నిర్మాణ కార్మిక బోర్డును కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-10-21T05:47:51+05:30 IST
భానుగుడి (కాకినాడ), అక్టోబరు 20: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిలుపుదల ఉత్తర్వులను తక్షణం ఉప సంహరించుకుని, బోర్డును కొనసాగించాలని

అఖిల పక్ష నాయకుల డిమాండ్
భానుగుడి (కాకినాడ), అక్టోబరు 20: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిలుపుదల ఉత్తర్వులను తక్షణం ఉప సంహరించుకుని, బోర్డును కొనసాగించాలని అఖిలపక్ష పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఏపీఎన్‌జీవో హోంలో మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఐఎన్‌టీసీయూ, ఏఐటీసీయూ, ఐఎ్‌ఫటీయూ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.5 కోట్ల పరిహారాలను 5 వేలమంది కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం.17తో తరలించిన రూ.450 కోట్లు, వైఎస్సార్ బీమా పేరుతో తరలించిన రూ.350 కోట్లు తిరిగి సంక్షేమ బోర్డుకు తరలించాలన్నారు. పనులు కోల్పోయిన కార్మికులకు రూ.10 వేలు జీవనోభృతి కల్పించాలని, ఇసుక పాలసీ కారణంగా లాక్‌డౌన్‌లో నష్టపోయిన భవన కార్మికులను ఆదుకోవాలని, ప్రభుత్వం చట్టాలను గౌరవించి కార్మికులకు న్యాయం చేయాలని డిమండ్ చేశారు. ఈనెల 29న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సుకు అన్ని పార్టీల నాయకులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీ ఎస్ నారాయణ, తాళ్లూరి రాజు, సత్యనారాయణ, జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.