అమలాపురానికి ఉత్తమ డివిజన్ అవార్డు
ABN , First Publish Date - 2020-10-03T07:16:18+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అమలాపురం డివిజన్ ఉత్తమ సేవలు అందించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది.

అమలాపురం టౌన్, అక్టోబరు 2: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అమలాపురం డివిజన్ ఉత్తమ సేవలు అందించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. డివిజన్ స్థాయిలో ఉత్తమ సేవల అవా ర్డును కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి చేతులమీదుగా సబ్‌కలెక్టర్ హిమాన్షు కౌశిక్ శుక్రవారం అందుకున్నారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామంగా ముమ్మిడివరం మండలం గేదెల్లంక, ఉత్తమ మండలంగా ఐ.పోలవరం ఈఅవార్డులను దక్కించుకున్నాయి.