-
-
Home » Andhra Pradesh » East Godavari » beach ongc pipeline work
-
సముద్ర తీరంలో ఓఎన్జీసీ పైపులైన్ పనులు
ABN , First Publish Date - 2020-11-25T06:21:41+05:30 IST
కృష్ణాగోదావరి బేసిన్ పరిధిలోని ఓఎన్జీసీ ఆధ్వర్యంలో చమురు, సహజవాయు ఉత్పత్తులను పెంచేందుకు ముమ్మర కృషి జరుగుతుంది.

అల్లవరం, నవంబరు 24: కృష్ణాగోదావరి బేసిన్ పరిధిలోని ఓఎన్జీసీ ఆధ్వర్యంలో చమురు, సహజవాయు ఉత్పత్తులను పెంచేందుకు ముమ్మర కృషి జరుగుతుంది. బంగాళాఖాతంలోని సముద్రం జలాల్లో ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి చమురు, సహజవాయు(గ్యాస్) ఉత్పత్తులను తీసి ఓడలరేవులో ఆన్‌షోర్ ప్లాంట్‌కు తరలిస్తారు. దీనికి సంబంధించి ఓడలరేవు సముద్రతీరం నుంచి ఓఎన్జీసీ ఆన్‌షోర్ ప్లాంట్ వరకు పదకొండు కిలోమీటర్ల పొడువున మూడు పైపులైన్లు వేస్తున్నారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ ఆధ్వర్యంలో పది రోజులుగా పైపులైన్ పనులు జరుగుతున్నాయి. మెక్‌డాల్మ్‌ంట్, శ్రీసాయి కంపెనీల ఆధ్వర్యంలో సముద్ర జలాల్లో ఫిబ్రవరి నాటికే పైపులైన్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. సహజవాయువుతో పాటు క్రూడాయిల్ కూడా తరలిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.