అప్రమత్తంకండి

ABN , First Publish Date - 2020-10-13T07:20:57+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఆదేశాలతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సబ్‌ కలెక్టర్‌ అనుపమ

అప్రమత్తంకండి

భారీ వర్షాలు కురిసే అవకాశం 

- కంట్రోల్‌ రూం ఏర్పాటు  - సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి 


రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఆదేశాలతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి ఆదేశించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అధిక వర్షాల వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా కార్యాలయ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9849909695కు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే అత్యవసర శాఖలకు సంబంధించి కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాల్లో సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి సోమవారం సాయంత్రం పర్యటించారు. రూరల్‌ మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పిడింగొయ్యి ప్రాంతంలో వర్షపునీరు నివాస ప్రాంతాల్లోకి వచ్చినట్టు సమాచారం రావడంతో సబ్‌ కలెక్టర్‌ వెళ్లి పరిశీలించారు. వర్షపునీరు ఇళ్లల్లోకి వెళ్లకుండా తక్షణమే కల్వర్టు నిర్మించాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.


అనంతరం బొమ్మూరులోని వెంకటగిరి కొండచరియలు విరిగిపడు తున్న ప్రాంతాన్ని పరిశీలించి పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో 33 కేవీలైన్‌ వల్ల భయాందోళనకు గురవుతున్నామని ప్రజలు విజ్ఞప్తి చేయడంతో విద్యుత్‌లైను మార్పునకు తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట తహశీల్దార్‌ రియాజ్‌ హుస్సేన్‌, ఎంపీడీవో నాతి బుజ్జి, పంచాయతీరాజ్‌శాఖ డీఈ, ఏఈలు ఉన్నారు.




 కంట్రోల్‌ రూం నెంబర్లు...

రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో 0883-2442344, అగ్నిమాపకశాఖ కార్యాలయం 0883- 2444101, 8977224230, విద్యుత్‌శాఖ కార్యాలయం 0883-246333354, 9490610093, రోడ్లు భవనాలశాఖ కార్యాలయం 0883-2479400, జలవనరులశాఖ కార్యాలయం 0883-2417419, 9491058003, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 99086677225 నెంబర్లు ఏర్పాటు చేశామని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. ఇవి 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ప్రజలకు ఏ విధమైన సమస్య వచ్చినా సమాచారం ఇవ్వాలని కోరారు.


అలాగే డివిజన్‌ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో మండలస్థాయి కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆలమూరులో 9849903902, గోకవరంలో 8008803194, కడియంలో 9849903901, కోరుకొండలో 8008003195, రాజమహేంద్రవరం అర్బన్‌లో 9849903898, రూరల్‌లో 9849903860, రాజానగరంలో 9849903900, సీతానగరంలో 8008803192 నెంబర్లకు సమాచారం తెలపవచ్చన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే సంబంధిత నెంబర్లకు తెలియజేయాలని సబ్‌ కలెక్టర్‌ కోరారు. 



Updated Date - 2020-10-13T07:20:57+05:30 IST