బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం

ABN , First Publish Date - 2020-10-07T10:36:55+05:30 IST

ఏడాదిగా రాష్ట్రంలో బీసీల సంక్షేమాన్ని సీఎం జగన్‌ గాలికి వదిలేశారని టీడీపీ బీసీ నేత దాస్యం ప్రసాద్‌ విమర్శించారు...

బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 6: ఏడాదిగా రాష్ట్రంలో బీసీల సంక్షేమాన్ని సీఎం జగన్‌ గాలికి వదిలేశారని టీడీపీ బీసీ నేత దాస్యం ప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీలకు రూ.608 కోట్ల 90 లక్షల రుణాలు ఇచ్చారని, జగన్‌ అధికారంలోకి వచ్చాక కేవలం 3,1189 మందికి మత్రామే ఇంటర్వ్యూలు నిర్వహించారని రుణాలు అందించలేదన్నారు. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు కందికొండ అనంత్‌, పాతర్లపల్లి సురేష్‌, మల్లవరపు ఈశ్వరరావు, ఎంశ్రీనివాసరావు, కెరాజేశ్వరరావు, ఎంరవిబాబు పాల్గొన్నారు.

Read more