బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే

ABN , First Publish Date - 2020-12-30T06:09:04+05:30 IST

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే

కాజులూరు, డిసెంబరు 29: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు పేర్కొన్నారు. గొల్లపాలెంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను వారు ఆవిష్కరించారు. అనంతరం మేడిశెట్టి శ్రీరాములు మాస్టారు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడారు.  కార్యక్రమంలో దత్తపీఠం శృంగవృక్షం శ్రీసాయిదత్తనాగానంద సరస్వతి స్వామీజీ, న్యాయవాది పిల్లి శ్రీనివాసరావు, వ్యాపారవేత్త బొక్కా శ్రీనివాసరావు, శీలమంతుల వీరభద్రరావు, ఏడిద బ్రహ్మానందంచార్యులు, రామచంద్రపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మేడిశెట్టి సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ బొడ్డు విష్ణుమూర్తి, అమలాపురం పార్లమెంట్‌ బీసీసెల్‌ అధ్యక్షుడు కడలి రాంపండు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T06:09:04+05:30 IST