-
-
Home » Andhra Pradesh » East Godavari » balabalagi amount 245 laksh
-
బాలబాలాజీ ఆదాయం రూ.2.45లక్షలు
ABN , First Publish Date - 2020-12-06T06:49:07+05:30 IST
అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.2,45,600 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ పి.బాబూరావు తెలిపారు.

మామిడికుదురు, డిసెంబరు 5: అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.2,45,600 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ పి.బాబూరావు తెలిపారు. కార్తీకమాసం శనివారం కావడంతో దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని 4,280మంది భక్తులు దర్శించుకున్నారని, వారికి ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు ధర్మకర్తల మండలి చైర్మన్ పిచ్చిక చిన్నా తెలిపారు.