రహ‘దారుణం

ABN , First Publish Date - 2020-10-01T07:34:07+05:30 IST

గోతులమయంగా ఉన్న ఈ రహదారి వెంకట్రాయపురంలోనిది.. గోర్స-పండూరు-కొమరగిరి గ్రామాలకు కాకినాడ వైపు ఇటుగానే వెళ్లాలి.

రహ‘దారుణం

అధ్వానంగా గోర్స-పండూరు రహదారి..

ఐదేళ్లుగా ఇదే పరిస్థితి


కొత్తపల్లి, సెప్టెంబరు 30: గోతులమయంగా ఉన్న ఈ రహదారి  వెంకట్రాయపురంలోనిది.. గోర్స-పండూరు-కొమరగిరి గ్రామాలకు కాకినాడ వైపు ఇటుగానే వెళ్లాలి. ఎంతోమంది ఇటుగా పొట్టకూటికోసం చిన్న,చితక ఉపాధి కోసం సైకిళ్లు, వివిధ వాహనాలపై కాకినాడకు వెళ్లివస్తుంటారు. ఐదేళ్ల పైబడి ఈ రోడ్డు దుస్థితిపై ప్రజాప్రతినిధులను, అధికారులను అడిగి ప్రజలు విసుగెత్తిపోయారు.


ఇటీవలకాలం ఈ రహదారి మరీ అధ్యానంగా మారింది. పగటిపూట నడిచి వెళ్లాలన్నా భయం పుడుతోంది. చీకటి పడితే రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. రోడ్డు బాగుచేయండి మహాప్రభూ అని ఎన్నిసార్లు వేడుకొన్నా ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ దయ చూపడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-10-01T07:34:07+05:30 IST