బాలిక అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-12-15T06:46:14+05:30 IST

యర్రపోతవరానికి చెందిన బాలిక అదృశ్యంపై పామర్రు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

కె.గంగవరం, డిసెంబరు 14: యర్రపోతవరానికి  చెందిన బాలిక అదృశ్యంపై పామర్రు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యర్రపోతవరం శివారు గుబ్బలవారిపేటకు చెందిన గుబ్బల శ్రీను సోమవారం నుంచి 17ఏళ్ల కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సత్యవాడకు చెందిన ఒక యువకుడు తన కుమార్తెను మభ్యపెట్టి తీసుకుపోయినట్టు శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఎస్‌ఐ వినయ్‌ప్రతాప్‌ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-15T06:46:14+05:30 IST