ఎంపీడీవో నారాయణమూర్తి సేవలకు పురస్కారం

ABN , First Publish Date - 2020-10-03T07:43:33+05:30 IST

గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కాకినాడ రూరల్‌ మండలంలో సుమారు 52 వేలు అర్జీల స్వీకరణ

ఎంపీడీవో నారాయణమూర్తి సేవలకు పురస్కారం

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 2: గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కాకినాడ రూరల్‌ మండలంలో సుమారు 52 వేలు అర్జీల స్వీకరణ, సమస్యల పరిష్కారం చేసినందుకు జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు (బెస్ట్‌ ఫెర్‌ఫార్మెన్స్‌) అవార్డును ఎంపీడీవో, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో పి.నారాయణమూర్తికి శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్‌ డి.మురళీధరరెడ్డి, జేసీ లక్ష్మీశ అందజేశారు. నారాయణమూర్తిని మంత్రి కురసాల కన్నబాబు అభినందించారు.

Updated Date - 2020-10-03T07:43:33+05:30 IST