మూకుమ్మడి దాడి కేసులో 14మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-10-24T06:45:20+05:30 IST

పెదవలసల, లక్ష్మీపతిపురం గ్రామస్థుల మధ్య జరిగిన దాడి కేసుకు సంబంధించి డీఎస్పీ వి.బీమారావు పర్యవేక్షణలో రూరల్‌ సీఐ ఎ.మురళీకృష్ణ శుక్రవారం 14మందిని అరెస్టు చేశారు. ఈ దాడిలో పెదవలసలకు చెందిన అరదాడి నూకప్రసాద్‌ అలియాస్‌ రాజు(20) మృతి చెందాడు.

మూకుమ్మడి దాడి కేసులో 14మంది అరెస్టు
నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ బీమారావు

తాళ్లరేవు, అక్టోబరు 23: పెదవలసల, లక్ష్మీపతిపురం గ్రామస్థుల మధ్య జరిగిన దాడి కేసుకు సంబంధించి డీఎస్పీ వి.బీమారావు పర్యవేక్షణలో రూరల్‌ సీఐ ఎ.మురళీకృష్ణ శుక్రవారం 14మందిని అరెస్టు చేశారు. ఈ దాడిలో పెదవలసలకు చెందిన అరదాడి నూకప్రసాద్‌ అలియాస్‌ రాజు(20) మృతి చెందాడు. ఈ సందర్భంగా డీఎస్పీ బీమారావు విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి లక్ష్మీపతిపురానికి చెందిన ఏ1గా మల్లాడి వరదరాజు, మరో 13మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నామన్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ను గాయపర్చిన కేసు, ఇంకా మరికొన్ని కేసులు నమోదు చేశామని, విచారణ తర్వాత మరికొంతమందిని అరెస్టు చేస్తామని చెప్పారు. కోరింగ ఎస్‌ఐ వై.సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.


విజయవాడ దుర్గమ్మకు పట్టువసా్త్రలు సమర్పిస్తున్న అన్నవరం ఈవో, ట్రస్టీలు (ఎఎనవి..2)

విజయవాడ దుర్గమ్మకు అన్నవరం దేవస్థానం పట్టు వసా్త్రలు సమర్పణ

అన్నవరం, అక్టోబరు 23: దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం విజయవాడ దుర్గమ్మకు అన్నవరం దేవస్థానం తరుపున పట్టువసా్త్రలు సమర్పించారు. ఈవో త్రినాథరావు, పాలకమండలి సభ్యులు తీసుకెళ్లగా దుర్గగుడి ఈవో సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సత్యదేవుడి సోదరిగా భావించే దుర్గమ్మకు ఏటా పట్టువసా్త్రలు సమర్పించడం సంప్రదాయం. ఈవో వెంట ట్రస్టీలు వాసిరెడ్డి జగన్నాథం ఉన్నారు.


రాజమహేంద్రవరం పుష్కర్‌ఘాట్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

ఘనంగా బతుకమ్మ పండుగ

రాజమహేంద్రవరం సిటీ/ఎటపాక, అక్టోబరు 23: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో బతుకమ్మ పండుగను బీసీ సంక్షేమ సంఘం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. సంఘం నగర అధ్యక్షుడు గోలి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సంఘ మహిళలు ఎస్‌ ప్రమీల, జీవీఎస్‌ లక్ష్మీతులసి, సుభాషిణి బోణాలు ఎత్తుకుని పుష్కరాలరేవుకు చేరుకుని, రేవు ప్రాంగణంలో దించి బతుకుమ్మ సం బరాలు చేశారు. బ తుక్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ వేడుకను నిర్వహించారు. తెలంగాణలో మాత్రమే జరిగే బతుకమ్మ పండుగను గతేడాది నుంచి రాజమహేంద్రవరంలో తెలుగింటి బతుకమ్మగా జరుపుతున్నామని వారు చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోడుగు శ్రీను, మూంత సుమతి, డి.రూక్కు, పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఎటపాక మండలంలో గౌరిదేవిపేట, నందిగామ, తోటపల్లి, నెల్లిపాక, రాయనపేట తదితర గ్రామాల్లో సంబరాలను నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో వెన్నముద్ద బతుకమ్మను ఏర్పాటుచేసి, పూజలు నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. తొమ్మిదో రోజు శనివారం (నేటి)తో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి.


కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), అక్టోబరు 23: జిల్లాలోని ఆటో, బస్‌, టాక్సీ, లారీలు నడిపేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తితో కలిసి ట్రాన్స్‌పోర్టు అధికారులు, ఆటో, బస్‌, టాక్సీ, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోతే జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. చాలా చోట్ల కనీసం మాస్క్‌ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి డ్రైవర్లు కొవిడ్‌పై అవగాహన పెంపొందించుకుని ఆటో, బస్‌, లారీల్లో మాస్క్‌ లేకుండా ఎవరినీ అనుమతించకూడదన్నారు. ఈ వాహనాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలన్నారు. కొవిడ్‌ నియమాలు తెలియపరిచే చిన్నసైజ్‌ పోస్టర్లు వాహనాల లోపల, బయట అతికించాలన్నారు. దీనికి అన్ని వాహనాల అసోసియేషన్‌ ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో డీటీసీ సీహెచ్‌ ప్రతాప్‌, ఎంవీఐఆర్‌ సురే్‌షకుమార్‌, ఏఎంఐ ఎ.ఉదయ్‌కుమార్‌, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుగ్గన బాబ్జి, పలు సంఘాల ప్రతినిధులు బి.వెంకటేశ్వరరావు, సీహెచ్‌ వెంకటరెడ్డి, టిమూర్తి, ఇతర వాహనాల యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

పరిశ్రమల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

పరిశ్రమల్లో కొవిడ్‌ నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. దీనికిగాను జిల్లాలోని పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్‌ యాప్‌ ద్వారా పరిశ్రమలశాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 30 వరకు కొవిడ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మైక్రో, మీడియం, పరిశ్రమల ప్రతినిధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జేసీ కీర్తి, పరిశ్రమలశాఖ జీఎం వి.శ్రీనివాసు, ఏపీఐఐసీ జెడ్‌ఎం సుధాకర్‌, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 

మార్చి నాటికి పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేయాలి 

జిల్లాలో నాడు-నేడు పథకం ద్వారా ఆర్‌అండ్‌బీ చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు కచ్చితంగా వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ డిమురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జేసీ కీర్తితో కలిసి ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇంజనీర్లతో పీహెచ్‌సీల నిర్మాణ పనులపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాడు-నేడు ద్వారా జిల్లాలో తొలి దశలో 119 పీహెచ్‌సీలు నిర్మించనున్నామన్నారు. ఇసుక, సిమెంట్‌కు సంబంధించి సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇంజనీర్లు సమన్వయంతో పనిచేసి నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పీడీ విజయకుమార్‌, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఈఈలు వెంకటేశ్వరరావు, శ్రీనివాస నాయక్‌, టి.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T06:45:20+05:30 IST