మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై అట్రాసిటీ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-12T09:10:03+05:30 IST

కాకినాడ రూరల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుమారుడు తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన

మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై అట్రాసిటీ కేసు నమోదు

కాకినాడ రూరల్‌, మార్చి11: కాకినాడ రూరల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుమారుడు తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం చిత్రహింసకు గురిచేసి వదిలేసినట్లు పిల్లి రాధాకృష్ణపై భార్య పిల్లి మంజుప్రియ ఫిర్యాదుచేసినట్లు ఇంద్రపాలెం ఎస్‌ఐ నాగార్జునరాజు తెలిపారు. సామర్లకోటమండలం మాధవపట్నంకు చెందిన మంజుప్రియ 2011లో పిల్లి రాధాకృష్ణతో ప్రేమవివాహమైందని, ఇప్పుడు తనను పట్టించుకోకుండా రాధాకృష్ణ కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని, తాను ఎస్సీ కులానికి చెందడంతో కులంపేరుతో దూషిస్తున్నారని ఆమె ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, గృహహింస కేసు నమోదుచేశామన్నారు. ఫిర్యాదులో పిల్లి రాధాకృష్ణను ఎ1 గానూ, పిల్లిసత్యనారాయణ మూర్తి ఎ2, పిల్లి అనంతలక్ష్మి ఎ3, పిల్లి కృష్ణప్రసాద్‌ను ఎ4గానూ కేసు నమోదుచేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-03-12T09:10:03+05:30 IST