ఏటీయం కార్డు అప్‌డేట్‌ పేరుతో ఆన్‌లైన్‌ దోపిడీ

ABN , First Publish Date - 2020-10-21T05:50:58+05:30 IST

ఏటీయం కార్డు అప్‌ డేట్‌ పేరుతో ఒక వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలోంచి రూ.1.09లక్షలు దుండగులు ఆనలైన దోపిడీకి పాల్పడ్డారు.

ఏటీయం కార్డు అప్‌డేట్‌ పేరుతో ఆన్‌లైన్‌ దోపిడీ

  • బ్యాంక్‌ ఖాతాలోంచి రూ.1.09 లక్షల అపహరణ

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 20: ఏటీయం కార్డు అప్‌ డేట్‌ పేరుతో ఒక వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలోంచి రూ.1.09లక్షలు దుండగులు ఆనలైన దోపిడీకి పాల్పడ్డారు. ప్రకాష్‌నగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక శ్యామలనగర్‌కు చెందిన ఎ.శ్రీనివాసశర్మకు ఈనెల 16న ఓ వ్యక్తి పోన చేసి ‘మీ ఏటీయం కార్డు అప్‌డేట్‌ చేయాలి, లేకుంటే స్తంభిస్తుంది’ అని చెప్పాడు. దీంతో శర్మ అవతలి వ్యక్తి అడిగిన మొత్తం సమాచారంతోపాటు తన ఫోనకు వచ్చిన ఓటీపీ నెంబరు కూడా చెప్పడంతో అవతలి వ్యక్తి కాల్‌ కట్‌ చేవాడు. అటుపై చూస్తే శర్మకు తన ఖాతాలోంచి రూ.1.09లక్షలు డ్రా అయ్యినట్టు మెసేజ్‌ వచ్చింది. దీంతో  శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-10-21T05:50:58+05:30 IST