రైతు దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-07-08T10:28:32+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం రైతు దినోత్సవంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో

రైతు దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

సామర్లకోట, జూలై 7: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం రైతు దినోత్సవంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సామర్లకోటలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వ్యవసాయ సహాయ సంచాలకులు జీవీ పద్శశ్రీ, మండల వ్యవసాయాధికారి ఐ.సత్య తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో అందిస్తున్న రైతు భరోసా కిసాన్‌ క్రెడిట్‌, మ త్స్య కిసాన్‌ క్రెడిట్‌, రైతు విజ్ఞానబడి, పశు వైద్యం తదితర వ్యవసాయ అనుబంధ శాఖలపై అవగాహన కల్పిస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల ఆవరణలో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-07-08T10:28:32+05:30 IST