‘అరకు పార్లమెంట్‌ను మూడు జిల్లాలుగా చేయాలి’

ABN , First Publish Date - 2020-07-19T10:40:34+05:30 IST

అరకు పార్లమెంట్‌ను మూడు జిల్లాలుగా చేయాలని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో అన్నారు.

‘అరకు పార్లమెంట్‌ను మూడు జిల్లాలుగా చేయాలి’

రంపచోడవరం, జూలై 18: అరకు పార్లమెంట్‌ను మూడు జిల్లాలుగా చేయాలని  మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో అన్నారు. అరకు పార్లమెంటులోని రంపచోడవరం, పాడేరు, అరకు, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ స్థానాలను రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్నారు. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి పాడేరు ఐటీడీఏ ప్రధాన కేంద్రంగా, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ స్థానాలను కలిపి పార్వతీపురం ఐటీడీఏ కేంద్రంగా, రంపచోడవరం ఐటీడీఏ కేంద్రంగా మొత్తం మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. 

Updated Date - 2020-07-19T10:40:34+05:30 IST