సచివాలయాల్లో దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-10-07T10:01:22+05:30 IST

గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జేసీ రాజకుమారి అధికారులను ఆదేశించారు...

సచివాలయాల్లో దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి

జేసీ రాజకుమారి 


పెదపూడి, అక్టోబరు 6: గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జేసీ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెదపూడి మండలం సంపర సచివాలయాన్ని జేసీ సందర్శించి సిబ్బంది, వలంటీర్ల పనితీరుపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పఽఽథకాలు, వాటి అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. వారి పనితీరుపై జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిందన్నారు. విధుల్లో ఎవరు అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.విజయభాస్కర్‌, తహశీల్దార్‌ టి.సుభాష్‌, ఆర్‌ఐ రమేష్‌, వైసీపీ నాయకుడు తిబిరిశెట్టి ఆదినారాయణ పాల్గొన్నారు.

Read more