-
-
Home » Andhra Pradesh » East Godavari » ap governtment failure
-
‘ప్రభుత్వ ఉదాసీన వైఖరి’
ABN , First Publish Date - 2020-12-15T06:39:18+05:30 IST
రాష్ట్రంలో దళితులు, మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణ మని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు.

అమలాపురం టౌన్, డిసెంబరు 14: రాష్ట్రంలో దళితులు, మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణ మని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా దళితులపై అత్యాచా రాలు, దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. మహిళా హోంమంత్రి ఏలు బడిలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. స్థానిక హౌసింగ్‌బోర్డు కాల నీలోని టీడీపీ కార్యాలయంలో పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశానికి ఆనం దరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ పాలనలో దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపి ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, ప్రధాన కార్యదర్శి అధికారి జయవెంకటలక్ష్మి, తెలుగు మహిళా ప్రముఖులు బొక్కా రుక్మిణి, మాడా మాధవి, మందపాటి అనిత, మట్టపర్తి భారతి, లక్కింశెట్టి సూర్యకుమారి, గెల్లా మీనాకుమారి పాల్గొన్నారు.