జారుతున్న ఏటిగట్లు

ABN , First Publish Date - 2020-10-04T09:23:19+05:30 IST

జారుతున్న ఏటిగట్లు

జారుతున్న ఏటిగట్లు

పి.గన్నవరం, అక్టోబరు 3: గోదావరి వరదల నుంచి గ్రామాలకు రక్షణ కల్పించే ఏటిగట్లకు నేడు రక్షణ కరువైంది. నాణ్యత లేక బలహీనంగా ఉన్న చోట ఏటిగట్లు దిగిపోతున్నాయి. 2006లో గోదావరికి వచ్చిన వరదను బట్టి ఏటిగట్లను పటిష్టపర్చారు. అయితే జిల్లాలో సుమారు 30కిలోమీటర్ల ఏటిగట్టు పటిష్టం చేయకుండా వివిధ కారణాలతో అసంపూర్తిగా వదిలివేశారు.  లంకలగన్నవరంలో నడిగాడికి వెళ్లే రహదారికి సమీపంలో భారీ వర్షాలకు ఏటిగట్టు ఒక పంటపొలాలు వైపు జారిపోతుంది. ఈఏటిగట్టుకు ఆదిలోనే చర్యలు చేపట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే మొండెపులంక లాకు వద్ద 2006లో గండిపడిన చోట ఏటిగట్టు ప్రధాన పంట కాలువలోకి జారిపోతూనే ఉంది. అఽధికారులు రూ.లక్షలు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదు. అలాగే ఏటిగట్లు అసంపూర్తిగా ఉన్న చోట స్థానికులు వర్షకాలంలో నానాఅవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లంకలగన్నవరం ఏటిగట్టుకు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2020-10-04T09:23:19+05:30 IST