లారీని ఢీకొన్న మరో లారీ

ABN , First Publish Date - 2020-03-04T09:19:48+05:30 IST

గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు

లారీని ఢీకొన్న మరో లారీ

డ్రైవర్‌ మృతి.. మృతుడు చిత్తూరు వాసి


గొల్లప్రోలు రూరల్‌, మార్చి 3: గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లుతున్న లారీని వన్నెపూడి-చెందుర్తి జంక్షన్‌ వద్ద మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో చిత్తూరు జిల్లా చెరుకు మంగళంపల్లికి చెందిన లారీ డ్రైవర్‌ శివప్రసాద్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హైవే పోలీసులు బయటకు తీసి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-04T09:19:48+05:30 IST