ఘనంగా ప్రాకారసేవ
ABN , First Publish Date - 2020-12-01T06:24:22+05:30 IST
అన్నవరం సత్యదేవుడికి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి పర్వదినాన గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించే వారు. అయితే కొవిడ్ నిబంధనల కారణంగా గిరి ప్రదక్షిణ రద్దు చేయడంతో ఆ స్థానంలో స్వామివారి ప్రాకార సేవను ఘనంగా నిర్వ హించారు.
అన్నవరం, నవంబరు 30: అన్నవరం సత్యదేవుడికి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి పర్వదినాన గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించే వారు. అయితే కొవిడ్ నిబంధనల కారణంగా గిరి ప్రదక్షిణ రద్దు చేయడంతో ఆ స్థానంలో స్వామివారి ప్రాకార సేవను ఘనంగా నిర్వ హించారు. ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్లను ప్రధానాలయం నుంచి మేళతాళాల నడుమ సర్వాంగ సుందరంగా సుగందభరిత పుష్పాలతో తీర్చిదిద్దిన వెండితిరుచ్చిపై కొలువుదీర్చారు. ఈవో త్రినాఽథరావు, చైర్మన్ రోహిత్, పాలకమండలి సభ్యులు ప్రాకార సేవను ప్రారంభించారు. పండితుల వేదమంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ప్రదక్షిణ చేయి ంచారు. అనంతరం హారతులిచ్చి తిరిగి స్వామి, అమ్మ వార్లను ప్రధానాలయానికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.