-
-
Home » Andhra Pradesh » East Godavari » annavaram police conistable death
-
దేవస్థానం సత్రంలో కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2020-12-27T07:10:12+05:30 IST
అన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.రఘురాముడు శనివారం మధ్యాహ్నం కొండదిగువున దేవస్థానానికి చెందిన సత్యనికేతన్ సత్రంలో గుండెపోటుతో మృతిచెందినట్టు అన్నవరం పోలీసులు తెలిపారు.

అన్నవరం, డిసెంబరు 26: అన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.రఘురాముడు శనివారం మధ్యాహ్నం కొండదిగువున దేవస్థానానికి చెందిన సత్యనికేతన్ సత్రంలో గుండెపోటుతో మృతిచెందినట్టు అన్నవరం పోలీసులు తెలిపారు. కడపకు చెందిన రఘురాముడు కుటుంబసభ్యులు తునిలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహానికి ప్రత్తిపాడు సీఐ రాంబాబు, ఎస్‌ఐ రవికుమార్ నివాళులర్పించారు. పండితులు సత్రం ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేపట్టాల్సి ఉంది.