గోపురంపై అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-11-25T05:54:00+05:30 IST

సత్యదేవుడి తొలిపావంచా వద్ద ఉన్న గోపురంపై మంగళవారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది.

గోపురంపై అగ్ని ప్రమాదం
గోపురంపై అగ్ని ప్రమాదం

సత్యదేవుడి తొలిపావంచా వద్ద స్వల్ప అగ్నిప్రమాదం

అన్నవరం, నవంబరు 24: సత్యదేవుడి తొలిపావంచా వద్ద ఉన్న గోపురంపై మంగళవారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా విద్యుత్‌ దీపాలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ఎటువంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.


Read more