సహస్ర దీపాలంకరణ సేవ పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-11-06T06:07:51+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో మార్చి నెలలో నిలిపివేసిన సహస్ర దీపాలంకరణ సేవను ఎట్టకేలకు గురువారం పునరుద్ధరించారు. 2017లో అప్పటి ధర్మకర్తల మండలి సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే సత్యప్రసాద్‌ సుమారు రూ.30 లక్షల వ్యయంతో మండపం నిర్మించి సేవను ప్రారంభించారు.

సహస్ర దీపాలంకరణ సేవ పునరుద్ధరణ
సహస్రదీపాలంకరణ సేవ నిర్వహిస్తున్న పండితులు

అన్నవరం, నవంబరు 5: కొవిడ్‌-19 నేపథ్యంలో రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో మార్చి నెలలో నిలిపివేసిన సహస్ర దీపాలంకరణ సేవను ఎట్టకేలకు గురువారం పునరుద్ధరించారు. 2017లో అప్పటి ధర్మకర్తల మండలి సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే సత్యప్రసాద్‌ సుమారు రూ.30 లక్షల వ్యయంతో మండపం నిర్మించి సేవను ప్రారంభించారు. ప్రతి నిత్యం నిర్వహించే సేవను కరోనా ఆంక్షల సడలింపు తర్వాత కూడా పునరుద్ధరించలేదు. విషయం దాత దృష్టికి వెళ్లడంతో ఆయన దేవస్థానం అధికారులతో సంప్రదించి పునరుద్ధరించాలని కోరారు. కొందరు మాత్రం సహస్రదీపాలంకరణ సేవను వారానికి ఒకసారి చేపట్టాలని ప్రతిపాదించారు. అప్పట్లో నిబంధనల ఫైలును పరిశీలించగా ప్రతి నిత్యం జరపాలని ఉంది. దీంతో ఇకపై ప్రతినిత్యం నిర్వహిస్తామని పీఆర్వో కొండలరావు తెలిపారు.

Updated Date - 2020-11-06T06:07:51+05:30 IST