వేగంగా వైద్య సేవలకే అంబులెన్స్‌ వ్యవస్థ

ABN , First Publish Date - 2020-07-03T10:16:54+05:30 IST

పేదలకు మెరుగైన, వేగంగా వైద్య సేవలందించడానికే 108, 104 ఆంబులెన్స్‌ వ్యవస్థ ప్రవేశపెట్టారని, దీనికి ఆద్యుడు దివంగత సీఎం వైఎస్‌

వేగంగా వైద్య సేవలకే అంబులెన్స్‌ వ్యవస్థ

డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్‌  108, 104 వాహనాలను ప్రారంభించిన మంత్రులు


జీజీహెచ్‌ (కాకినాడ), జూలై 2 : పేదలకు మెరుగైన, వేగంగా వైద్య సేవలందించడానికే 108, 104 ఆంబులెన్స్‌ వ్యవస్థ ప్రవేశపెట్టారని, దీనికి ఆద్యుడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. గురువారం జిల్లాకు చేరుకున్న ఈ వాహనాలను ఆయనతోపాటు, మరో మంత్రి పినిపే విశ్వ రూప్‌, కాకినాడ, అమలాపురం ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్‌ డి మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు.


మంత్రి బోస్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కొత్త టెక్నాల జీతో తయారు చేసిన 108, 104 వాహ నాలు జిల్లాకు మంజూరు చేశారన్నారు. కరోనా విషయంలో ఇతర రాష్ర్టా లతో పోల్చి చూస్తే ఏపీలో తక్కువ కేసులు ఉన్నాయన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ ఇప్పుడు జిల్లాకు వచ్చిన ఆంబులెన్స్‌ల వల్ల ప్రతీ గ్రామం, పట్టణంలో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో శివారు  ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అత్యవసర పరిస్థితిలో 108 అంబులెన్స్‌ సదుపాయం లభించాలంటే ఇప్పటివరకు చాలా కష్టంగా ఉండేదన్నారు. జిల్లాకు అవసరమైన వాహనాలు వచ్చి నందున ఇక నుంచి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.


ఈ కార్యక్రమంలో జేసీ రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె బాబ్జీ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లికార్జున, జీజీహెచ్‌ సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు, 108,104 జిల్లా అపరేషన్‌ మేనేజర్‌ అవినాష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వాహనాలతో కాకినాడ నగర రోడ్ల మీద ర్యాలీగా నిర్వహించి ప్రదర్శించారు.

Updated Date - 2020-07-03T10:16:54+05:30 IST