ఏఎంసీ చైర్‌పర్సన్‌ మర్మావతి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2020-10-08T08:01:42+05:30 IST

రాజోలు ఏఎంసీ చైర్‌పర్సన్‌గా పితాని మర్మావతి, వైస్‌చైర్మన్‌ దొండపాటి ప్రసన్నకుమార్‌, సభ్యులతో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు...

ఏఎంసీ చైర్‌పర్సన్‌ మర్మావతి ప్రమాణస్వీకారం

రాజోలు, అక్టోబరు 7: రాజోలు ఏఎంసీ చైర్‌పర్సన్‌గా పితాని మర్మావతి, వైస్‌చైర్మన్‌ దొండపాటి ప్రసన్నకుమార్‌, సభ్యులతో  ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ మర్మావతి మాట్లాడుతూ మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, సభ్యులను రాష్ట్ర ఎస్సీ మాలకార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, ఎంపీ చింతా అనూరాధ అభినందించారు. కార్యక్రమంలో పితాని రాంబాబు, బొమ్మిడి వెంకటేష్‌, మార్కెట్‌యార్డు సెక్రటరీ అబ్దుల్‌ రెహ్మాన్‌, నాయకులు, సిబ్బంది  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-08T08:01:42+05:30 IST