అంబేడ్కర్ భావజాలంతో ముందుకు సాగుతున్నాం
ABN , First Publish Date - 2020-12-13T06:34:39+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో తామంతా ముందుకు సాగుతున్నామని రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ అన్నా రు.

వన సమ్మేళనంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి
రాజమహేంద్రవరం సిటీ డిసెంబరు 12: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో తామంతా ముందుకు సాగుతున్నామని రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ అన్నా రు. రాజమహేంద్రవ రంలో శనివారం పద్మావతినగర్ పార్కులో దళిత గిరిజన మైనార్టీ జేఏసీ వన మన చైతన్య సమ్మేళనం మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్‌రామ్, పశ్చిగోదావరిజిల్లా గోపా లపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రిటైర్డ్ ఏఎస్పీ జి.మురళీకృష్ణ, కర్నూల్ డీఎస్పీవెంకటాద్రి, ఏపీఈపీడీసీఎల్ ఈఈ తిలక్‌కుమార్, నగర ప్రముఖులు చందన నాగేశ్వర్‌లు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర నిర్వాహ కుడు డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు ముఖ్యఅతిఽథులు పూలమాలలతో నివాళు అర్పించారు. ఈసందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ అంబేడ్కర్ కోరు కున్న సమా జనిర్మాణం కోసం తాము కృషిచేస్తున్నామన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏదైతే కోరుకున్నారో తమ ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. తొలుత రిటైర్డ్ ఏఎస్పీ జి.మురళీ కృష్ణ, ఏపీఈపీడీసీఎల్ ఈఈ తిలక్‌కుమార్‌లు రాజ్యాం గంలో అంబేడ్కర్ పొందుప రిచిన అంశాలను వివరిస్తూ ఆయన గొప్పతనాన్ని వివరించారు. అనంతరం వన భోజనాలు చేశారు. నిర్వాహకుడు అజ్జరపు వాసును పలువురు అభినందనలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో యాంకర్ చోటు, గిరిజన నాయకులు గన్నెయ్య, సత్తిబాబు, దళిత నాయకులు తాళ్ళూరి బాబూరా జేంద్రప్రసాద్, వైరాల అప్పారావు, ఏలిపే శ్రీనివాస్, వివిధ ప్రాంతాలకు చెందిన దళిత గిరిజన మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.