-
-
Home » Andhra Pradesh » East Godavari » Amalapuram student is ranked second in the state in AP eSet
-
ఏపీ ఈసెట్‌లో అమలాపురం విద్యార్థికి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు
ABN , First Publish Date - 2020-10-07T08:04:34+05:30 IST
భట్లపాలెం పాలిటెక్నిక్ విద్యార్థి మట్టా హేమంత్‌సాయిసత్య అనంత్ ఏపీ ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించాడు...

- ఇస్రోలో ఇంజనీర్ కావడమే లక్ష్యం : హేమంత్
అమలాపురం రూరల్, అక్టోబరు 6: భట్లపాలెం పాలిటెక్నిక్ విద్యార్థి మట్టా హేమంత్‌సాయిసత్య అనంత్ ఏపీ ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించాడు. అమలాపురం శ్రీరామపురానికి చెందిన హేమంత్ భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నికల్ విద్యను అభ్యసించి 98 శాతం మార్కులు సాధిం చాడు. ఇప్పటికే తెలంగాణ ఈసెట్‌లో(ఈఈఈ బ్రాంచి) హేమంత్ మూడో ర్యాంకు, ఇంటిగ్రేటెడ్‌లో ఏడో ర్యాంకు సాధించాడు. ఇంజనీరింగ్ కోర్సులో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించిన హేమంత్‌ను విద్యాసంస్థల అధినేత బోనం కనకయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎంవీ ప్రసాద్, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.రాజగోపాల్, పరిపాలనాధికారి జక్కం వెంకట కృష్ణారావులు అభినందించారు. ఇస్రోలో పనిచేయాలన్నదే తన జీవితాశయమని, అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్య ను అభ్యసిస్తానని హేమంత్ తెలిపాడు. ర్యాంకు సాధించినట్టు తెలియగానే తల్లిదండ్రులు మట్టా శ్రీనివాసరావు, విజయదుర్గా భవానీ కుమారుడు హేమంత్‌కు స్వీట్లు తినిపించారు.