ముగ్గురికి ఏఎస్పీలుగా పదోన్నతులు

ABN , First Publish Date - 2020-10-01T08:12:07+05:30 IST

పలు ప్రాంతాల్లో డీఎస్పీలుగా పనిచేస్తున్న ముగ్గురికి అడిషినల్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు కల్పిస్తూ డీజీపీ గౌతం సవాంగ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ

ముగ్గురికి ఏఎస్పీలుగా పదోన్నతులు

 కాకినాడ క్రైం, సెప్టెంబరు 30: పలు ప్రాంతాల్లో డీఎస్పీలుగా పనిచేస్తున్న ముగ్గురికి అడిషినల్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు కల్పిస్తూ డీజీపీ గౌతం సవాంగ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ సిటీ ట్రాఫిక్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌ పాపారావుకు రాజమహేంద్రవరం అర్బన్‌ అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి కల్పించారు.


రాజమహేంద్రవరం నార్త్‌ డీఎస్పీగా పని చేస్తున్న పి. సత్యనారాయణరావు విజయనగరం పరిపాలన విభాగ అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొందారు. రాజమహేంద్రవరం ట్రాఫిక్‌ డీఎస్పీగా పని చేస్తున్న ఎస్‌.వెంకట్రావుకు అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ  ఉత్తర్వుల్లో ఆదేశించారు.


Updated Date - 2020-10-01T08:12:07+05:30 IST