మిర్తిపాడులో వ్యవసాయ సదస్సు

ABN , First Publish Date - 2020-11-25T05:55:09+05:30 IST

ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు మండలంలోని మిర్తిపాడులో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు.

మిర్తిపాడులో వ్యవసాయ సదస్సు

సీతానగరం, నవంబరు 24: ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు మండలంలోని మిర్తిపాడులో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. గ్రామీణ వ్యవసాయ పని-అనుభవ కార్యక్రమంలో భాగంగా  రాజమహేంద్రవరం కళశాల అసోసియేట్‌ డీన్‌ జి.సుబ్బారావు అధ్యక్షతన వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సీవీ రెడ్డి వరి, మొక్కజొన్న, అపరాల్లో మేలైన యాజ మాన్య పద్ధతులను వివరించారు. డాక్టర్‌ ఎన్‌.కృష్ణంరాజు, డాక్టర్‌ ప్రవీణ, డాక్టర్‌ సుధీర్‌, నాగేంద్ర, ఆనంద్‌కుమార్‌, ఏరువాక కేంద్రం సమన్వయకర్త ఎ.సీతారామశర్మ తదితరులు పాల్గొన్నారు.

Read more