రాయితీపై విత్తనాలు

ABN , First Publish Date - 2020-12-11T06:02:39+05:30 IST

రాయితీపై మేలురకం వరి విత్తనాలు పంపిణీ చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేసామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్‌ చెప్పారు.

రాయితీపై విత్తనాలు

సామర్లకోట, డిసెంబరు 10: రాయితీపై  మేలురకం వరి విత్తనాలు పంపిణీ చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేసామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్‌ చెప్పారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో 80 శాతం రాయితీపై సరఫరా చేసేందుకు 3650 క్వింటాళ్ల విత్త నాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన ప్రాంతాల్లో 5 శాతం రాయితీపై అందుబాటులో ఉన్నాయన్నారు. 

6997 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు

జిల్లాలో 6997 ఎకరాల్లో దాళ్వా సాగుకు రైతులు సమాయత్తమయ్యారని జేడీ చెప్పారు. 2305 ఎకరాల్లో నారుమడులు పూర్తవ్వగా, 4692 ఎకరాల్లో విత్తనాలు వెదజల్లు పద్ధతిన సాగు పనులు నిర్వహించారని చెప్పారు.

2.14 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లా వ్యాప్తంగా 426 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గురువారం సాయంత్రం నాటికి 2.14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జేడీ ప్రసాద్‌ చెప్పారు.  ధాన్యాన్ని పూర్తిగా ఆరబోసి 17 శాతానికి తేమ శాతం పెరగకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. డిప్యూటీ డైరెక్టర్‌ మాధవరావు, ఆర్‌బీకే డిప్యూటీ డైరెక్టర్‌ వీటీ రామారావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T06:02:39+05:30 IST