ఏఈ సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-12-01T07:05:28+05:30 IST
పుదుచ్చేరిలోని డీఆర్‌డీఏ పరిధిలోని బ్లాక్ డెవలప్‌మెంట్‌లో ఏఈగా పనిచేస్తున్న యానానికి చెందిన అమీర్ హుస్సేన్‌పై పలు ఆరోరపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు.

యానాం, నవంబరు 30: పుదుచ్చేరిలోని డీఆర్‌డీఏ పరిధిలోని బ్లాక్ డెవలప్‌మెంట్‌లో ఏఈగా పనిచేస్తున్న యానానికి చెందిన అమీర్ హుస్సేన్‌పై పలు ఆరోరపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. యానాంలో పనిచేసిన సమయంలో అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలతో అతడిని పుదుచ్చేరి బదిలీ చేశారు. అప్పటి నుంచి విచారణ కొసాగుతుంది. అయితే ఇటీవల ఈఅంశం మానవహక్కుల కమిషన్‌కు చేరడంతో మరోసారి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మానవహక్కుల కమిషన్ సిఫార్సుతో అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.