చేనేత సంక్షోభంపై తక్షణ చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-10-28T06:13:48+05:30 IST
తీవ్ర సంక్షోభంలో పడిపోయిన సహకార రంగం, చేనేత పరిశ్రమను తక్షణం ఆదుకోవాలని చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం సీఎం జగన్మోహనరెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ద్రాక్షారామ, అక్టోబరు 27: తీవ్ర సంక్షోభంలో పడిపోయిన సహకార రంగం, చేనేత పరిశ్రమను తక్షణం ఆదుకోవాలని చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం సీఎం జగన్మోహనరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం సీఎంకు ఆయన లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కోలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలకు తోడు ప్రస్తుతం కొవిడ్ కారణంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. కార్మికులకు హామీతో కూడిన ఉపాఽధి కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.