అదే ఉధృతి

ABN , First Publish Date - 2020-07-22T10:26:50+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం వందల్లో పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నాయి.

అదే ఉధృతి

జిల్లావ్యాప్తంగా మంగళవారం 425 మందికి పాజిటివ్‌

రాజమహేంద్రవరం నగరంలో 72, రూరల్‌లో 23

కాకినాడలో 48, గోకవరం 32,  కడియం 29, కాటేన్రికోన 22,  మండపేట 31, రావులపాలెం 31

జిల్లాలో మొత్తం 7,946కి చేరిన కొవిడ్‌-19 కేసులు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం వందల్లో పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నాయి. ఎక్కడికక్కడ పల్లెలు, పట్నాలు, నగరాల్లో మహమ్మారి పాతుకుపోయి ప్రజలను పీడిస్తోంది. దీంతో కేసుల సంఖ్య కలవరపెడు తున్నాయి. సోమవారం నాడు జిల్లావ్యాప్తంగా ట్రూనాట్‌, ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ కిట్ల ద్వారా మొత్తం 425 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిన ట్టు అధికారులు మంగళవారం విడుదల చేసిన కొవిడ్‌ బులిటెన్‌లో ప్రకటించారు. అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 72 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.


రాజమహేంద్రవరం రూరల్‌లో 23 మందికి కొవిడ్‌ సోకింది. కాకినాడ నగరంలో 48, రూరల్‌లో 11 మందికి పాజిటివ్‌ గా గుర్తించారు. గోకవరం మండలంలో 32, రావులపాలెం 31, కడియం 29, కాటేన్రికోన 22, మండపేట 31 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరప 12, కోరుకొండ 6, కపిలేశ్వరపురం, కోట నందూరులలో చెరో అయిదు, ఆలమూరు, అల్ల వరం, పిఠాపురం, రాజా నగరం, సఖినేటిపల్లి, చెరో మూడు, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, ప్రత్తి పాడు, రాజవొమ్మంగి, సీతానగరం మండలాల్లో రెండేసి, అయినవిల్లి, అమలాపురం, చింతూరు, మారేడుమిల్లి, మలికిపురం, రాయవరం, సామర్లకోట, శంఖ వరం, ఎటపాక మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.


విశాఖ జిల్లా వాసికి ఒకరికి, పశ్చిమగోదావరి జిల్లాకు  చెందిన ముగ్గురికి కొవిడ్‌ నిర్ధారించారు. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్‌-19 కేసుల సంఖ్య 7,946కి చేరుకున్నాయి. 425 కేసులు కొత్తగా నమోదవడంతో జిల్లావ్యాప్తంగా అద నంగా 19 కంటైన్మెంట్‌ జోన్లను విధించారు. అటు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 215. మంగళవారం 184 మంది కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా మంగళవారం జిల్లాలో కరప మండలంలో 38 పాజిటివ్‌ కేసులు కొత్తగా గుర్తించారు. ముమ్మిడివరం 21, తొండంగిలో 20, యు.కొత్తపల్లి మండలంలో 19, అంబా జీపేట 17, అల్లవరం 8 చొప్పున పాజిటివ్‌లు నిర్దారణ అయి నట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ కేసులను బుధవారం ప్రకటించనున్న బులిటెన్‌లో చేర్చనున్నారు.



Updated Date - 2020-07-22T10:26:50+05:30 IST